ఉస్మానియా జట్ల జోరు | Usmania teams lead in sepak takraw championship | Sakshi
Sakshi News home page

ఉస్మానియా జట్ల జోరు

Feb 19 2018 10:10 AM | Updated on Sep 4 2018 5:07 PM

Usmania teams lead in sepak takraw championship - Sakshi

ఉస్మానియా, నాగ్‌పూర్‌ జట్ల మధ్య మ్యాచ్‌ దృశ్యం

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్లు జోరు కనబరుస్తున్నాయి. ఓయూ ఆధ్వర్యంలోనే జరుగుతోన్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఉస్మానియా జట్లు విజయం సాధించాయి.

పురుషుల కేటగిరీలో ఉస్మానియా యూనివర్సిటీ 21–14, 18–21 తో ఆర్‌టీఎం నాగ్‌పూర్‌ యూనివర్సిటీపై గెలుపొందింది. మహిళల విభాగంలో తొలి మ్యాచ్‌లో ఉస్మానియా 17–21, 21–13, 21–18 తో మణిపూర్‌ యూనివర్సిటీని, రెండో మ్యాచ్‌లో 21–11, 21–3తో ఆర్‌టీఎం నాగ్‌పూర్‌ జట్టును ఓడించింది. మరోవైపు పురుషుల విభాగంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ 17–21, 21–11, 21–9తో కాలికట్‌ యూనివర్సిటీపై, రెండో మ్యాచ్‌లో 21–16, 21–16తో కుమాయున్‌ యూనివర్సిటీపై గెలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement