‘అధికారుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు’

Umar Showed No Remorse For Fixing Approaches,PCB - Sakshi

ఆ క్రికెటర్‌లో ఎటువంటి బాధా లేదు

బోర్డును క్షమాపణలు కూడా కోరలేదు

ఉమర్‌లో పశ్చాత్తాపం లేదు

కరాచీ:  అవినీతి ఆరోపణలపై మూడేళ్ల నిషేధాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌లో కనీసం పశ్చాత్తాపం ఎక్కడా కనబడటం లేదని పీసీబీ క్రమశిక్షణా ప్యానల్‌  పేర్కొంది.  తనకు పడిన నిషేధంపై ఎటువంటి చింతా లేని అ‍క్మల్‌.. బోర్డుకు కూడా క్షమాపణలు తెలుపలేదని ప్యానల్‌ చీఫ్‌ ఫజల్‌ ఈ మిరాన్‌ చౌహాన్‌ తెలిపారు. ఉమర్‌ అక్మల్‌ కేసులో సమగ్ర నివేదికను పీసీబీకి అందజేసిన ఫజల్‌..  దర్యాప్తు చేసేటప్పుడు కూడా అధికారుల్నిముప్పు తిప్పలు పెట్టడన్నారు. కనీసం బాధ్యత లేకుండా విచారణకు సైతం సహకరించలేదన్నారు. ఆర్టికల్‌ 2.4.4 నియమావళిని అక్మల్‌ అతిక్రమించిన కారణంగా అతనిపై సుదీర్ఘ కాలం నిషేధం పడిందన్నారు. బుకీలు సంప్రదించినప్పుడు దాన్ని బోర్డుకు చెప్పకుండా దాచి పెట్టడం అతి పెద్ద నేరమని ఫజల్‌ తెలిపారు. దీనిలో భాంగానే ఉమర్‌ అక్మల్‌ మూడేళ్ల నిషేధాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఉమర్‌ అక్మల్‌ విచారణకు సహకరించకపోవడంతోనే రెండు నెలల సమయం పట్టిందన్నారు.(అతనొక మూర్చ రోగి: పీసీబీ మాజీ చైర్మన్‌)

పీఎస్‌ఎల్‌కు సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ చేయమంటూ అక్మల్‌ను కొందరు సంప్రదించారు. దానికి అక్మల్ అంగీకరించలేదు. కానీ తనను బుకీలు  సంప్రదించిన విషయాన్ని గోప్యంగా ఉంచాడు.  ఈ విషయంపై కొన్ని నెలల క్రితం బయటపడటంతో ఉమర్‌పై వేటు తప్పలేదు. ఉమర్‌పై నిషేధమే సబబు అని భావించి పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు ఫిట్‌నెస్‌ టెస్టుకు హాజరైన క‍్రమంలో ట్రైనర్‌తో ఉమర్‌ దూకుడుగా వ్యవహరించాడనే అపవాదు కూడా ఉంది. ఆ సమయంలోనే అక్మల్‌పై వేటు పడుతుందని భావించినా దాని నుంచి తప్పించుకున్నాడు.కేవలం ఒక వార్నింగ్‌తో పీసీబీ సరిపెట్టడంతో ఉమర్‌ బయటపడ్డాడు. అయితే ఫిక్సింగ్‌ వివాదంలో మాత్రం అక్మల్‌ నిషేధాన్ని చవిచూడాల్సి వచ్చింది. గతంలో మికీ  ఆర్థర్‌ కోచ్‌గా ఉన్న సమయంలో కూడా ఉమర్‌ ప్రవర్తన విసుగు తెప్పించేది. ఆర్థర్‌పై పలు మార్లు బహిరంగ విమర్శలు చేసి తరచు వార్తల్లో నిలిచేవాడు ఉమర్‌.  తన అంతర్జాతీయ కెరీర్‌లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లను ఉమర్‌ ఆడాడు.గత అక్టోబర్‌లో పాకిస్తాన్‌ తరఫున అక్మల్‌ చివరిసారి ప్రాతినిథ్యం వహించాడు. (ధావన్‌ ఒక ఇడియట్‌.. స్ట్రైక్‌ తీసుకోనన్నాడు..!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top