నేటి నుంచి కోకాకోలా కప్ టోర్నీ | to day onwards coca cola cup tournment | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కోకాకోలా కప్ టోర్నీ

Aug 12 2013 12:58 AM | Updated on Sep 1 2017 9:47 PM

కోకాకోలా కప్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ప్రారంభమవుతుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), కోకాకోలా సంస్థతో కలిసి ఈ అండర్-16 టోర్నీని నిర్వహిస్తుంది. ఈనెల 28 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి.

సాక్షి, హైదరాబాద్: కోకాకోలా కప్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ప్రారంభమవుతుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), కోకాకోలా సంస్థతో కలిసి ఈ అండర్-16 టోర్నీని నిర్వహిస్తుంది. ఈనెల 28 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. 16 జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. ఒక్కో పూల్ నుంచి తొలి స్థానంలో నిలిచిన నాలుగు జట్లు 26 నుంచి జరిగే సెమీఫైనల్ పోటీలకు అర్హత పొందుతాయి.
 
 అనంతరం 28న టైటిల్ పోరు జరుగుతుంది. నగరంలోని భవాన్స్ రామకృష్ణ కాలేజి, కాల్ పబ్లిక్‌స్కూల్, ఇండస్ పబ్లిక్ స్కూల్ (సైనిక్‌పురి), హెచ్‌పీఎస్ రామంతాపూర్, బేగంపేట్, గురుకుల్ విద్యాపీఠ్ (ఇబ్రహీంపట్నం) తదితర ప్లే గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 50 వేలు, రన్నరప్ జట్టుకు రూ. 35 వేలు నగదు బహుమతి అందజేస్తారు. తొలి రోజు జరిగే మ్యాచ్‌ల్లో భేగాస్ హైస్కూల్‌తో జాన్సన్ గ్రామర్ స్కూల్; పల్లవి మోడల్ స్కూల్‌తో ఇండస్ వరల్డ్ స్కూల్; మెహబూబ్ కాలేజి హైస్కూల్ జట్టుతో నాసర్ స్కూల్, సెయింట్ జోసఫ్ స్కూల్‌తో సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజి తలపడతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement