కీర్తన సంచలనం | India Keerthana Pandian wins IBSF world U-16 snooker title | Sakshi
Sakshi News home page

కీర్తన సంచలనం

Oct 8 2018 1:57 AM | Updated on Oct 8 2018 1:57 AM

 India Keerthana Pandian wins IBSF world U-16 snooker title - Sakshi

ముంబై: అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్‌ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్‌) ప్రపంచ అండర్‌–16 స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన కీర్తన పాండియన్‌ విజేతగా నిలిచింది. కర్ణాటకకు చెందిన కీర్తన ఫైనల్లో 3–1 (53–44, 16–49, 62–42, 72–39) ఫ్రేమ్‌ల తేడాతో అల్బీనా లెస్‌చుక్‌ (బెలారస్‌)పై గెలిచింది.

అంతకుముందు నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కీర్తన 3–0తో మనస్విని (భారత్‌)పై, 3–0తో అలీనా ఖైరూలినా (రష్యా)లపై గెలిచి సెమీస్‌ చేరింది. సెమీఫైనల్లో ఆమె 3–1తో డిఫెండింగ్‌ చాంపియన్‌ అనుపమ (భారత్‌)పై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement