వాలెన్సియా హ్యాట్రిక్
వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు చక్కటి విజయాన్ని అందుకుంది
చెన్నై: వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు చక్కటి విజయాన్ని అందుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీ రెండో సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ లో వాలెన్సియా హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో 4-1 తేడాతో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీని కంగుతినిపించింది. ఈ సీజన్‌లో వాలెన్సియాకు ఇది రెండో హ్యాట్రిక్ కావడం విశేషం. మూడో నిమిషంలోనే ధన గోల్ చేయగా వాలెన్సియా (16, 80, 81వ నిమిషాల్లో) వరుసగా మూడు గోల్స్ సాధించాడు. ఇంజ్యూరీ (90) సమయంలో కేరళకు జర్మన్ ఓదార్పు గోల్ అందించాడు. నేడు అట్లెటికో డి కోల్‌కతా, ఎఫ్‌సీ గోవా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.