ఓటమితో మొదలు... | The Indian women's hockey team defeat in the Test series began. | Sakshi
Sakshi News home page

ఓటమితో మొదలు...

May 5 2016 12:35 AM | Updated on Sep 3 2017 11:24 PM

బ్రిటన్‌తో ఐదు మ్యాచ్‌ల హాకీ టెస్టు సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది.

మార్లో (ఇంగ్లండ్): బ్రిటన్‌తో ఐదు మ్యాచ్‌ల హాకీ టెస్టు సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా 0-2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఆట 38వ నిమిషంలో, 57వ నిమిషంలో ఎలీ రాయర్ బ్రిటన్‌కు రెండు గోల్స్‌ను అందించింది. ఆట ఏడో నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా ఫలితం లేకపోయింది. రెండో క్వార్టర్‌లో రీతూ గోల్ చేసే ప్రయత్నాన్ని బ్రిటన్ గోల్‌కీపర్ అడ్డుకుంది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ గురువారం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement