కష్టాల్లో టీమిండియా | team india struggles in semi final | Sakshi
Sakshi News home page

కష్టాల్లో టీమిండియా

Mar 26 2015 3:14 PM | Updated on Sep 2 2017 11:26 PM

కష్టాల్లో టీమిండియా

కష్టాల్లో టీమిండియా

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా కష్టాల్లో పడింది. 108 పరుగులకే నాలుగు వికెట్లను నష్టపోయింది.

సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా కష్టాల్లో పడింది. టీమిండియా 28 ఓవర్లు ముగిసే సరికి130 పరుగులు చేసిన టీమిండియా నాలుగు వికెట్లను కోల్పోయింది. 329 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలో ఆకట్టుకున్నప్పటికీ తరువాత అనవసరపు షాట్లకు యత్నించి వికెట్లను చేజార్చుకుంది.

 

సురేష్ రైనా(7)పరుగులు చేసి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు రోహిత్ శర్మ(34) , విరాట్ కోహ్లీ(1), శిఖర్ ధావన్ (45) పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుత అజ్యింకా రహానే(23), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(11) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement