రైనాకు తప్పిన ప్రమాదం | Suresh Raina survives car accident after tyre burst | Sakshi
Sakshi News home page

రైనాకు తప్పిన ప్రమాదం

Sep 13 2017 12:51 AM | Updated on Aug 14 2018 3:22 PM

రైనాకు తప్పిన ప్రమాదం - Sakshi

రైనాకు తప్పిన ప్రమాదం

భారత క్రికెటర్‌ సురేశ్‌ రైనా కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

లక్నో: భారత క్రికెటర్‌ సురేశ్‌ రైనా కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం దులీప్‌ ట్రోఫీలో ఆడుతున్న అతను ఘజియాబాద్‌ నుంచి కాన్పూర్‌కు రేంజ్‌ రోవర్‌ కారులో వెళుతుండగా తెల్లవారుజాము రెండు గంటలకు ఎటావా నగర సమీపంలో వెనుక టైర్‌ పగిలింది. ఆ సమయంలో రైనానే డ్రైవింగ్‌ చేస్తున్నాడు.

మరో టైర్‌ లేకపోవడంతో రైనా అక్కడే కాసేపు వేచి ఉండగా... స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రైనా ప్రయాణం కోసం మరో వాహనాన్ని సమకూర్చారు. అయితే కారు అతివేగంగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, లేనిపక్షంలో దారుణం జరిగేదని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement