స్టీవెన్ స్మిత్ సెంచరీ | Steven Smith Century | Sakshi
Sakshi News home page

స్టీవెన్ స్మిత్ సెంచరీ

Jun 13 2015 12:28 AM | Updated on Sep 3 2017 3:38 AM

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ (336 బంతుల్లో 175 బ్యాటింగ్; 19 ఫోర్లు...

కింగ్‌స్టన్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ (336 బంతుల్లో 175 బ్యాటింగ్; 19 ఫోర్లు; 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో రాణించాడు. దీంతో శుక్రవారం రెండో రోజు కడపటి వార్తలందేసరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 117 ఓవర్లలో 8 వికెట్లకు 350 పరుగులు చేసింది. క్రీజులో తనతో పాటు హాజెల్‌వుడ్ (25 బంతుల్లో 5 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు 258/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఆసీస్‌ను విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. అయితే వికెట్లు పడుతున్నా స్మిత్ మాత్రం ఓపిగ్గా ఆడుతూ జట్టు భారీ స్కోరుకు సహాయపడ్డాడు. టేలర్‌కు ఐదు, హోల్డర్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Advertisement
 
Advertisement
Advertisement