సెమీస్‌లో శ్రీవల్లి, రుషీల్‌ ఖోస్లా | Sri Valli in Semis of Under 14 Tennis Tournament | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో శ్రీవల్లి, రుషీల్‌ ఖోస్లా

Mar 7 2019 10:17 AM | Updated on Mar 7 2019 10:17 AM

Sri Valli in Semis of Under 14  Tennis Tournament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా ర్యాంకింగ్‌ అండర్‌–14 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో మేడిశెట్టి శ్రీవల్లి వర్మ, రుషీల్‌ ఖోస్లా ముందంజ వేశారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ సెమీస్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన అండర్‌–14 బాలికల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో శ్రీవల్లి వర్మ 6–3, 6–2తో సౌమ్రితపై విజయం సాధించింది.

బాలుర సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ రుషీల్‌ ఖోస్లా 6–3, 6–2తో ఐదో సీడ్‌ వినీత్‌ ముత్యాలను ఓడించాడు. ఇతర బాలుర క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో వెంకట్‌ రిషి (అమెరికా) 6–3, 6–2తో వత్సల్‌ మణికంఠన్‌పై, ఏడో సీడ్‌ ప్రజ్వల్‌ తివారీ 6–2, 7–6 (7/5)తో దేవహర్షిత్‌ నీలమ్‌ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్‌ రితిన్‌ ప్రణవ్‌ సెంథిల్‌ కుమార్‌ 6–3, 6–1తో అదిత్‌ అమర్‌నాథ్‌పై గెలుపొంది సెమీస్‌లో అడుగు పెట్టారు. మరోవైపు బాలికల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్‌ సౌమ్య 6–4, 6–1తో ఆమోదిని నాయక్‌పై, ఆరోసీడ్‌ సుహిత 6–1, 6–0తో ఐకరాజుపై గెలుపొందగా... కుందనశ్రీ 6–0, 6–1తో రెండోసీడ్‌ చహనకు షాకిచ్చి సెమీస్‌కు చేరుకుంది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement