67 పరుగులకే లంక ఆలౌట్ | sri lanka team all out just 67 runs against with england team | Sakshi
Sakshi News home page

67 పరుగులకే లంక ఆలౌట్

May 29 2014 1:09 AM | Updated on Nov 9 2018 6:43 PM

67 పరుగులకే లంక ఆలౌట్ - Sakshi

67 పరుగులకే లంక ఆలౌట్

ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న ఇంగ్లండ్... శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.

మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం
 మాంచెస్టర్: ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న ఇంగ్లండ్... శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కుక్‌సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన లంక 24 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. లంకకు ఇది మూడో అత్యల్ప స్కోరు.
 
  పేసర్ క్రిస్ జోర్డాన్ (5/29) పదునైన బంతులతో లంక బ్యాటింగ్ లైనప్‌ను వణికించాడు. దీంతో సంగక్కర (13), జయవర్ధనే (12), మాథ్యూస్ (11)తో సహా అందరూ విఫలమయ్యారు. అండర్సన్, ట్రేడ్‌వెల్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 12.1 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 73 పరుగులు చేసి గెలిచింది. కుక్ (30 నాటౌట్), బెల్ (41 నాటౌట్) నిలకడగా ఆడారు. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే లార్డ్స్‌లో శనివారం జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement