
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆదివారం బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గాడిలో పడాలని సఫారీలు భావిస్తున్నారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ముందుగా బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గత మ్యాచ్‌లో గాయపడ్డ హషీమ్ ఆమ్లా..నేటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో డేవిడ్ మిల్లర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు తొడ కండరాల గాయంతో బాధపడిన బంగ్లా కెప్టెన్ మొర్తజా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.
ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ జట్లు 20 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా 17 మ్యాచ్‌ల్లో గెలిస్తే.. బంగ్లా మూడింట్లో నెగ్గింది. ఇక వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు మూడుసార్లు తలపడితే రెండు సార్లు దక్షిణాఫ్రికా, ఒకసారి బంగ్లా విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో ఎదురైన చేదు అనుభవం నుంచి బయటపడాలని సఫారీలు భావిస్తుండగా, టోర్నీలో శుభారంభం చేయాలని బంగ్లాదేశ్ యోచిస్తోంది.
తుది జట్లు
బంగ్లాదేశ్
మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకిబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మొహ్మద్ మిథున్, మొహ్మదుల్లా, మొసద్దెక్ హుస్సన్, మహ్మద్ సైఫుద్దీన్, మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మాన్
దక్షిణాఫ్రికా
డుప్లెసిస్(కెప్టెన్), డీకాక్, మర్కరమ్, రసీ వాన్ దెర్ డసెన్, జేపీ డుమనీ, డేవిడ్ మిల్లర్, ఫెహ్లుకోవియో, క్రిస్ మోరిస్, కగిసో రబడా, లుంగీ ఎన్‌గిడి, ఇమ్రాన్ తాహీర్