ఎట్టకేలకో విజయం | Somdev Devvarman defeats Matthew Ebden in Portugal Open first round | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకో విజయం

Apr 30 2014 1:53 AM | Updated on Sep 2 2017 6:42 AM

ఎట్టకేలకో విజయం

ఎట్టకేలకో విజయం

భారత నంబర్‌వన్ సింగిల్స్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఎట్టకేలకు తొలిరౌండ్ అడ్డంకిని అధిగమించాడు. ఏటీపీ పోర్చుగల్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ప్రపంచ 102వ ర్యాంకర్ సోమ్‌దేవ్ మూడు నెలల తర్వాత తొలి రౌండ్‌లో గెలుపొందడం గమనార్హం.

 మూడు నెలల తర్వాత సింగిల్స్ మ్యాచ్ గెలిచిన సోమ్‌దేవ్
  ఏటీపీ పోర్చుగల్ ఓపెన్
 
 ఒయిరస్ (పోర్చుగల్): భారత నంబర్‌వన్ సింగిల్స్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఎట్టకేలకు తొలిరౌండ్ అడ్డంకిని అధిగమించాడు. ఏటీపీ పోర్చుగల్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ప్రపంచ 102వ ర్యాంకర్ సోమ్‌దేవ్ మూడు నెలల తర్వాత తొలి రౌండ్‌లో గెలుపొందడం గమనార్హం.
 
  వరుసగా ఐదు టోర్నీల్లో మొదటి రౌండ్ మ్యాచ్‌ల్లో  ఓటమి పాలయ్యాడు. తాజా టోర్నీలో భారత ఆటగాడు 6-2, 6-3తో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌పై విజయం సాధించాడు. గంటా 13 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సోమ్‌దేవ్ వరుస సెట్లలో తనకన్నా మెరుగైన 64వ ర్యాంకర్‌ను కంగుతినిపించి  పరాజయాల పరంపరకు బ్రేక్ వేశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement