విజేతలు సరోజ్‌ సిరిల్, వరుణి జైస్వాల్‌ | Siril And Varuni Jaiswal Clinches Table Tennis Titles | Sakshi
Sakshi News home page

విజేతలు సరోజ్‌ సిరిల్, వరుణి జైస్వాల్‌

Sep 23 2019 10:00 AM | Updated on Sep 23 2019 10:00 AM

Siril And Varuni Jaiswal Clinches Table Tennis Titles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్‌ ఎంవీ శ్రీధర్‌ స్మారక స్టేట్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సరోజ్‌ సిరిల్‌ (ఏడబ్ల్యూఏ), వరుణి జైస్వాల్‌ (జీఎస్‌ఎం) విజేతలుగా నిలిచారు. ఖైరతాబాద్‌ వేదికగా ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో సరోజ్‌  12–10, 8–11, 3–11, 11–6, 11–5, 6–11, 11–7తో వరుణ్‌ శంకర్‌ (ఎంఎల్‌ఆర్‌)పై గెలుపొందగా... వరుణి 11–3, 11–9, 11–5, 11–4తో రాగనివేదిత (జీటీటీఏ)ను ఓడించింది. యూత్‌ విభాగంలో మొహమ్మద్‌ అలీ, జి. ప్రణీత టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు.

ఫైనల్లో మొహమ్మద్‌ అలీ (ఎల్‌బీఎస్‌) 11–5, 8–11, 11–5, 11–6, 11–7తో అలీ మొహమ్మద్‌పై, ప్రణీత  12–10, 11–9, 9–11, 6–11, 11–9, 13–11తో వరుణి (జీఎస్‌ఎం)పై గెలుపొందారు. సబ్‌ జూనియర్‌ బాలుర ఫైనల్లో జషాన్‌ సాయి (ఎంఎల్‌ఆర్‌) 4–11, 11–8, 11–9, 11–9, 11–5తో కార్తీక్‌ (ఏడబ్ల్యూఏ)పై నెగ్గాడు. బాలికల తుదిపోరులో పలక్‌ (జీఎస్‌ఎం) 6–11, 11–7, 11–8, 12–10, 11–5తో అనన్య (జీఎస్‌ఎం)ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. పోటీల అనంతరం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి. వినోద్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement