అజయ్, సింధు శుభారంభం

Sindhu, Ajay won AITA Opener Matches - Sakshi

‘ఐటా’ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) ర్యాంకింగ్‌ టోర్నీలో తెలంగాణ క్రీడాకారులు అజయ్‌ పృథ్విక్, సింధు జనగాం శుభారంభం చేశారు. ఫతేమైదాన్‌లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీలో సింగిల్స్‌ విభాగాల్లో వీరిద్దరూ ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో అజయ్‌ 7–5, 6–1తో అభిషేక్‌ శుక్లాపై గెలుపొందగా... మహిళల విభాగంలో ఎనిమిదో సీడ్‌ సింధు 6–1, 6–2తో ఆకాంక్ష (మహారాష్ట్ర)ను చిత్తుగా ఓడించింది.

ఇతర మహిళల తొలిరౌండ్‌ మ్యాచ్‌ల్లో స్మృతి 6–0, 6–0తో మేఘ ముత్తుకుమారన్‌ (తమిళనాడు)పై, సహజ (తెలంగాణ) 6–1, 6–3తో మౌలిక రామ్‌ (తెలంగాణ)పై, లిఖిత కాల్వ (తెలంగాణ) 6–0, 6–0తో శిల్పి స్వరూప దాస్‌ (ఒడిశా)పై, దీక్ష అజిత్‌ (ఏపీ) 6–0, 6–1తో వైశాలి ఠాకూర్‌ (తమిళనాడు)పై, లిఖిత లండా (ఏపీ) 6–0, 6–0తో ప్రియాంక రోడ్రిక్స్‌ (మహారాష్ట్ర)పై, ప్రతిభ (కర్నాటక) 6–2, 6–2తో అనీశ రాయుడు (ఏపీ)పై విజయం సాధించి రెండోరౌండ్‌కు చేరుకున్నారు.  

పురుషుల తొలిరౌండ్‌ మ్యాచ్‌ల ఫలితాలు

శివదీప్‌ కొసరాజు (ఏపీ) 6–3, 2–6, 7–6 (5)తో కైవల్య వామనరావు (మహారాష్ట్ర)పై, హేవంత్‌ కుమార్‌ (తెలంగాణ) 7–6 (8/6), 6–1తో అమర్‌ (కర్ణాటక)పై, సాయి శరణ్‌రెడ్డి (ఏపీ) 6–4, 7–5తో శ్రీనివాస్‌ (ఏపీ)పై, అనికేత్‌ వెంకట్‌ (తెలంగాణ) 6–4, 3–6, 7–5తో అరవింద్‌ రెడ్డిపై, కృష్ణతేజ (తెలంగాణ) 6–4, 6–2తో సుభాష్‌పై, టి. వినయ్‌ కుమార్‌ (కర్నాటక) 6–3, 3–6, 6–3తో సౌరభ్‌ కుమార్‌పై, డి. అఖిల్‌ కుమార్‌ 3–6, 6–4, 6–2తో కె. రోహిత్‌పై, ఆయుశ్‌ (పంజాబ్‌)6–2, 6–3తో తరుణ్‌ కర్రా (తెలంగాణ)పై, పృథ్వీ శేఖర్‌ (తమిళనాడు) 7–5, 6–2తో దుర్గ హిమకేశ్‌ (తెలంగాణ)పై గెలుపొందారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top