ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌: పసికూన భారీ స్కోర్‌

Scotland Set Target To 372 Runs Against  England   - Sakshi

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక వన్డే మ్యాచ్‌లో పసికూన స్కాట్లాండ్‌ 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టుకు నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన స్కాట్లాండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. బ్యాట్స్‌మెన్‌ మాథ్యూ క్రాస్‌ (48; 39 బంతుల్లో 10ఫోర్లు), కెప్టెన్‌ కైలే కోయెట్జర్ ‌(58; 49బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) చెలరేగడంతో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు అయింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రషీద్‌ విడదీశాడు. 

అనంతరం క్రీజులోకి వచ్చిన కామ్‌ మెక్‌లీడ్‌ (140 నాటౌట్‌; 94 బంతుల్లో 16ఫోర్లు, 3సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ నమోదు చేశాడు. చివర్లో జార్జ్‌ మున్సే(55), బెరింగ్టన్‌(39) చెలరేగడంతో స్కాట్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 371 పరుగుల భారీస్కోర్‌ సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో రషీద్‌, ప్లంకెట్‌ తలో రెండు వికెట్లు సాధించగా, మార్క్‌ వుడ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top