ఫైనల్ కు చేరిన సాకేత్ జోడీ | Sanam Myneni in men's doubles Asiad tennis final | Sakshi
Sakshi News home page

ఫైనల్ కు చేరిన సాకేత్ జోడీ

Sep 28 2014 6:50 PM | Updated on Sep 2 2017 2:04 PM

ఆసియా గేమ్స్ లో భాగంగా ఇక్కడ జరిగిన టెన్నిస్ డబుల్స్ మ్యాచ్ లో సాకేత్ మైనేని -సనామ్ సింగ్ జోడీ ఫైనల్ కు చేరింది.

ఇంచియాన్: ఆసియా గేమ్స్ లో భాగంగా ఇక్కడ జరిగిన టెన్నిస్ డబుల్స్ మ్యాచ్ లో సాకేత్ మైనేని -సనామ్ సింగ్ జోడీ ఫైనల్ కు చేరింది. ఈ జోడీ అద్భుత ప్రదర్శన కనబరిచి థాయ్ జంటను మట్టికరిపించింది.  భారత్ జోడీ 4-6, 6-3, 10-6  తేడాతో థాయ్ జోడీ సంచాయ్, సంచోత్ రతి వతనాలను కంగుతినిపించింది. కేవలం ఒక గంటా మూడు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో సాకేత్ జోడీ తొలి సెట్ ను కోల్పోయింది.

 

అయితే అనంతరం అనూహ్యంగా పుంజుకున్న ఈ జోడీ వరుస రెండు సెట్ లను గెలుచుకుని భారత్ కు మరో రజత పతకాన్ని ఖాయం చేశారు. మరో  సెమీఫైనల్లో దక్షిణాకొరియా విజయం సాధించి భారత్ పో్రుకు సిద్ధమైంది.ఈ మ్యాచ్ లో గెలిచి టెన్నిస్ లో స్వర్ణ పతకాన్ని అందించడానికి సాకేత్ జోడీ ఉవ్విళ్లూరుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement