సెమీస్‌లో సమీర్‌ వర్మ  | Samir Verma in semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సమీర్‌ వర్మ 

Apr 1 2018 12:57 AM | Updated on Apr 1 2018 12:57 AM

Samir Verma in semis - Sakshi

న్యూఢిల్లీ: ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు సమీర్‌ వర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ 17–21, 21–19, 21–15తో లుకాస్‌ కోర్వీ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు.

పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో కిడాంబి నందగోపాల్‌–ఆల్విన్‌ ఫ్రాన్సిస్‌ (భారత్‌) ద్వయం 21–19, 14–21, 8–21తో మార్క్‌ లామ్స్‌ఫస్‌–మార్విన్‌ సీడెల్‌ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది.    

Advertisement
 
Advertisement
Advertisement