
న్యూఢిల్లీ వేదికగా ఈనెల 26 నుంచి జరిగే ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వైదొలిగింది. కడుపు నొప్పి నుంచి తాను ఇంకా కోలుకోలేదని... అందుకే ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)కు సైనా సమాచారం ఇచ్చింది.
2015లో ఇండియా ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సైనా వైదొలగడంతో... మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ప్రస్తుతం భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే బరిలో ఉంది.