మెయిన్ ‘డ్రా’కు సాయి దేదీప్య | sai de deepya qualified main draw for fenesta open | Sakshi
Sakshi News home page

మెయిన్ ‘డ్రా’కు సాయి దేదీప్య

Oct 3 2016 11:02 AM | Updated on Sep 4 2017 4:02 PM

ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి యెద్దుల సాయి దేదీప్య మహిళల సింగిల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది.

సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి యెద్దుల సాయి దేదీప్య మహిళల సింగిల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో సాయి దేదీప్య ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సాయి దేదీప్య రెండో రౌండ్‌లో 9-2తో అద్రిజా బిశ్వాస్ (బెంగాల్)పై, మూడో మ్యాచ్‌లో 6-0, 6-1తో విభశ్రీ గౌడ (కర్ణాటక)పై గెలిచింది. క్వాలిఫయింగ్ ఇతర మ్యాచ్‌ల్లో తెలంగాణకే చెందిన శ్వేత నలెకల మూడో రౌండ్‌లో, సయ్యద్ గుల్స్ ్రబేగం తొలి రౌండ్‌లో ఓడిపోయారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement