breaking news
sai de deepya
-
క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల, సాయి దేదీప్య
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, యెద్దుల సాయి దేదీప్య తమ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రాంజల 6-1, 6-4తో ఆరుషి కక్కర్ (చండీగఢ్)పై గెలుపొందగా... అండర్-18 బాలికల సింగిల్స్ మూడో రౌండ్లో సాయి దేదీప్య 6-3, 6-3తో వాసవి (తమిళనాడు)ను ఓడించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సాయి దేదీప్య 3-6,5-7తో హిమాని మోర్ (హరియాణా) చేతిలో ఓడిపోయింది. హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుముల క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... సౌజన్య భవిశెట్టి తొలి రౌండ్లో ఓటమి చవిచూసింది. నిధి తొలి రౌండ్లో 6-1, 6-0తో సౌమ్య విజ్ (గుజరాత్)పై, రెండో రౌండ్లో 6-2, 6-2తో హర్ష సాయి చల్లా (హైదరాబాద్)పై గెలిచింది. సౌజన్య 3-6, 6-2, 2-6తో వైదేహి చౌదరీ (గుజరాత్) చేతిలో ఓటమి పాలైంది. అండర్-18 బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి లు షేక్ హుమేరా, లలిత దేవరకొండ, సహజ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... రష్మిక, హర్ష సాయి చల్లా, శ్రావ్య శివాని మూడో రౌండ్లో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో విష్ణువర్ధన్ 4-6, 3-6తో పరమ్‌వీర్ (చండీగఢ్)పై గెలుపొందగా... బెరైడ్డి సారుు శరణ్ రెడ్డి 6-7 (4/7), 6-1, 5-7తో రంజిత్ విరాళీ మురుగేశన్ (తమిళనాడు) చేతిలో పోరాడి ఓడిపోయాడు. -
మెయిన్ ‘డ్రా’కు సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి యెద్దుల సాయి దేదీప్య మహిళల సింగిల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో సాయి దేదీప్య ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సాయి దేదీప్య రెండో రౌండ్లో 9-2తో అద్రిజా బిశ్వాస్ (బెంగాల్)పై, మూడో మ్యాచ్‌లో 6-0, 6-1తో విభశ్రీ గౌడ (కర్ణాటక)పై గెలిచింది. క్వాలిఫయింగ్ ఇతర మ్యాచ్‌ల్లో తెలంగాణకే చెందిన శ్వేత నలెకల మూడో రౌండ్లో, సయ్యద్ గుల్స్ ్రబేగం తొలి రౌండ్లో ఓడిపోయారు.