వృద్ధిమాన్‌ సాహా వచ్చాడు.. | Saha Returns Fo SRH Against Rajasthan Royals Match | Sakshi
Sakshi News home page

వృద్ధిమాన్‌ సాహా వచ్చాడు..

Apr 27 2019 7:51 PM | Updated on Apr 27 2019 7:52 PM

Saha Returns Fo SRH Against Rajasthan Royals Match - Sakshi

జైపూర్‌: ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా స్థానిక సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ముందుగా సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌ను ఆహ్వానించాడు. ఇప్పటివరకూ సన్‌రైజర్స్‌ పది మ్యాచ్‌లు ఆడి ఐదింట గెలుపొందగా, రాజస్తాన్‌ రాయల్స్‌ 11 మ్యాచ్‌లకు గాను నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇక నుంచి ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అద్భుత విజయాన్ని సాధించి మంచి ఊపు మీద ఉన్న రాజస్తాన్‌ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

సన్‌రైజర్స్‌తో పోల్చుకుంటే పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉన్నప్పటికీ గురువారం కోల్‌కతాపై సాధించిన విజయం రాజస్తాన్‌ రాయల్స్‌లో నూతన ఉత్సాహాన్ని నింపింది. 17 ఏళ్ల రియాన్‌ పరాగ్‌ ఆ జట్టుకు ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. అజింక్యా రహానే, స్టీవ్‌ స్మిత్‌ కూడా ఫామ్‌లోకి రావడం శుభ పరిణామం. ఢిల్లీతో మ్యాచ్‌లో రహానే తన శైలికి భిన్నంగా విరుచుకుపడిన తీరు ఆకట్టుకుంది. సంజూ సామ్సన్, స్టువర్ట్‌ బిన్నీ బ్యాట్‌ ఝళిపిస్తే విదేశీ ఆటగాళ్లు లేని లోటు తీర్చినట్లవుతుంది. టర్నర్, లివింగ్‌స్టోన్‌ ఇప్పటికైనా రాణించాలి. ఆర్చర్‌ లేని బౌలింగ్‌ విభాగం కాస్త కలవరపరుస్తోంది. డెత్‌ ఓవర్లలో ఆర్చర్‌ మినహా రాయల్స్‌ తరఫున వేరెవరూ రాణించలేకపోయా రు. అయితే గత మ్యాచ్‌లో వరుణ్‌ ఆరోన్‌ ప్రదర్శనతో పాటు ఒషానే థామస్‌ బౌలింగ్‌ జట్టులో ఆశలు రేకెత్తిస్తోంది. ధావళ్‌ కులకర్ణితో పాటు, జైదేవ్‌ ఉనాద్కట్‌ తమ స్థాయికి తగినట్లు రాణించాల్సి ఉంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.... లీగ్‌లో మిగిలి ఉన్న నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం 3 గెలిస్తే నెట్‌ రన్‌రేట్‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌పై ఆశలు పెట్టుకునే పరిస్థితి. ఈ దశలో బెయిర్‌స్టో దూర మవడం సన్‌రైజర్స్‌ బలంగా తగ్గినట్టే కనబడుతోంది. ఈ తరుణంలో కెప్టెన్‌ విలియమ్సన్‌ రాణించక తప్పదు.  మనీశ్‌ పాండే గత మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైన విజయ్‌ శంకర్‌ మరింతగా రాణించాల్సిన అవసరం ఉంది. యూసుఫ్‌ పఠాన్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బెయిర్‌స్టో గైర్హాజరీలో వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా తుదిజట్టులోకి వచ్చాడు.

సన్‌రైజర్స్‌
విలియమ్సన్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్‌, షకిబుల్‌ హసన్‌, సాహా, దీపక్‌ హుడా, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సిద్దార్థ్‌ కౌల్‌, ఖలీల్‌ అహ్మద్‌

రాజస్తాన్‌ రాయల్స్‌
స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), అజింక్యా రహానే, సంజూ శాంసన్‌, రియాన్‌ పరాగ్‌, ఆస్టన్‌ టర్నక్‌, లివింగ్‌ స్టోన్‌,  స్టువర్ట్‌ బిన్నీ, శ్రేయస్‌ గోపాల్‌, ఉనాద్కత్‌, వరుణ్‌ అరోన్‌, ఓషాన్‌ థామస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement