
క్లబ్ క్రికెట్ ఆడేందుకు...
ముంబై: భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాటలోనే అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా అడుగులు వేస్తున్నాడు.
దక్షిణాఫ్రికా వెళుతున్న అర్జున్ టెండూల్కర్
ముంబై: భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాటలోనే అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా అడుగులు వేస్తున్నాడు. తన ఆటను మెరుగు పర్చుకోవడంలో భాగంగా అతను మరో సారి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతున్నాడు. గత ఏడాది కూడా సఫారీ పర్యటన చేసిన అర్జున్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సారి అతను వర్లి క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు.
ఈ టీమ్‌కు అర్జున్ కెప్టెన్ కూడా కావడం విశేషం. రెండు వారాల ఈ పర్యటనలో భాగంగా వర్లి క్రికెట్ క్లబ్ జట్టు 45 ఓవర్ల మ్యాచ్‌లు 10 ఆడుతుంది. 16 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపిక కాకముందు సచిన్ కూడా వరుసగా రెండేళ్లు ఇదే తరహాలో ఇంగ్లండ్‌లో క్లబ్ క్రికెట్ ఆడి తన ఆటకు పదును పెట్టుకున్నాడు. ‘ఇలాంటి పర్యటనలు కుర్రాళ్లు తమ ప్రతిభ నిరూపించుకునేందుకు మంచి అవకాశం కల్పిస్తాయి. గట్టి ప్రత్యర్థులతో పాటు ఫాస్ట్ పిచ్‌లపై ఆడితే క్రికెటర్ల సామర్థ్యం పెరుగుతుంది. దక్షిణాఫ్రికాలోని అత్యుత్తమ స్కూల్ టీమ్‌లు ఈ టోర్నీ బరిలోకి దిగుతాయి’ అని వర్లి క్లబ్ యజమాని అవినాశ్ కదమ్ వెల్లడించారు.