
ప్రపంచ చెస్ చరిత్రలో పిన్న వయస్సులో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందిన రెండో ప్లేయర్‌గా... భారత్ తరఫున జీఎం అయిన పిన్న వయస్కుడిగా శనివారం కొత్త రికార్డు నెలకొల్పిన భారత కుర్రాడు ప్రజ్ఞానంద గ్రెడైన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఇటలీలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో 12 ఏళ్ల ప్రజ్ఞానంద 7.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్ కూడా సంపాదించాడు. ఈ టోర్నీలో అతను ఆరు గేముల్లో గెలిచి, మిగతా మూడు గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు.