భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్ మండలి టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
దుబాయ్: భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్ మండలి టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం వెల్లడించిన ఈ జాబితాలో శ్రీలంక స్పిన్నర్ రంగన హెరాత్‌ను వెనక్కి నెట్టి అశ్విన్ తిరిగి రెండో స్థానానికి చేరాడు. హెరాత్ మూడో స్థానంలో ఉన్నాడు.
ఆల్‌రౌండర్స్ జాబితాలో జడేజా, అశ్విన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. షకీబ్ టాప్‌లో ఉన్నాడు. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ కోహ్లి తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా, పుజారా నాలుగో స్థానం.. ధావన్ 39 నుంచి 21వ స్థానానికి
ఎగబాకాడు.