
తిరువనంతపురం: మాజీ కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌కు ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. తిరువనంతపురంలో గురువారం వెస్టిండీస్‌తో ఐదో వన్డేకు ముందు నిర్వహించిన కార్యక్రమంలో దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ ఇందుకు సంబంధించిన జ్ఞాపికను అతడికి అందించారు.
దీంతో బిషన్ సింగ్ బేడీ, గావస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే తర్వాత భారత్ నుంచి ఈ ఘనత అందుకున్న ఐదో క్రికెటర్‌గా ద్రవిడ్ నిలిచాడు. ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ 164 టెస్టుల్లో 13,288 పరుగులు, 344 వన్డేల్లో 10,889 పరుగులు చేశాడు.