ప్రొ కబడ్డీ టైటిల్‌ స్పాన్సర్‌గా ‘వివో’ | Pro Kabaddi title sponsor 'Vivo' | Sakshi
Sakshi News home page

ప్రొ కబడ్డీ టైటిల్‌ స్పాన్సర్‌గా ‘వివో’

May 9 2017 12:47 AM | Updated on Sep 5 2017 10:42 AM

ప్రొ కబడ్డీ టైటిల్‌ స్పాన్సర్‌గా ‘వివో’

ప్రొ కబడ్డీ టైటిల్‌ స్పాన్సర్‌గా ‘వివో’

ఐపీఎల్‌ తర్వాత అంతగా ప్రేక్షకాదరణ పొందిన ఈవెంట్‌గా ఘనతకెక్కిన ప్రొ కబడ్డీ లీగ్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ను చైనా స్మార్ట్‌ఫోన్ల

జూలై 5న ఐదో సీజన్‌ ప్రారంభం

న్యూఢిల్లీ:
ఐపీఎల్‌ తర్వాత అంతగా ప్రేక్షకాదరణ పొందిన ఈవెంట్‌గా ఘనతకెక్కిన ప్రొ కబడ్డీ లీగ్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ను చైనా స్మార్ట్‌ఫోన్ల కంపెనీ ‘వివో’ చేజిక్కించుకుంది. ఐదేళ్ల పాటు ‘వివో’ టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగనుంది. జూలై 5న ఐదో సీజన్‌ లీగ్‌ ఆరంభమవుతుంది. కొత్తగా నాలుగు ప్రాంచైజీలు పెరగడంతో మొత్తం 12 జట్లు ఇందులో తలపడనున్నాయి. దీంతో 13 వారాలపాటు 130 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ‘వివోతో భాగస్వామ్యం కావడం అనందంగా ఉంది.

ఆట ఆదరణకు మేం మరింత కృషి చేస్తాం’ అని స్టార్‌ స్పోర్ట్స్‌ ఎండీ సంజయ్‌ గుప్తా అన్నారు. ‘కబడ్డీ లీగ్‌ బాగా ఆదరణ పొందింది. అలాంటి లీగ్‌తో జతకట్టడం గర్వంగా ఉంది’ అని ‘వివో’ భారత సీఈఓ కెంట్‌ చెంగ్‌ వెల్లడించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో భారత కబడ్డీ స్టార్స్‌ అనూప్‌ కుమార్, రాహుల్‌ చౌదరీలతోపాటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు బ్రెట్‌ లీ, మాథ్యూ హేడెన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement