భారత క్రీడాకారులకు ప్రణబ్ శుభాకాంక్షలు | President sends good wishes to Indian Olympics team | Sakshi
Sakshi News home page

భారత క్రీడాకారులకు ప్రణబ్ శుభాకాంక్షలు

Aug 5 2016 6:41 PM | Updated on Sep 4 2017 7:59 AM

భారత క్రీడాకారులకు ప్రణబ్ శుభాకాంక్షలు

భారత క్రీడాకారులకు ప్రణబ్ శుభాకాంక్షలు

రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఇతర దేశాల క్రీడాకారులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, ప్రపంచ దేశాలకు ఐకమత్యాన్ని చాటి చెప్పాలని భారత ఆటగాళ్లకు ఆయన సూచించారు.  

ప్రతీ క్రీడాకారుడు తనను తాను నిరూపించుకునే మెరుగైన వేదిక ఒలింపిక్స్ అనీ, ప్రపంచస్థాయి క్రీడాకారులతో తలపడే సమయంలో అద్భుతమైన పోరాటపటిమ కనబరచాలని ప్రణబ్ సూచించారు. భారత్ చెఫ్ డె మిషన్ మిషన్కు చెందిన రాకేష్ గుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మెగా ఈవెంట్‌లో మనవాళ్లంతా దేశం గర్వించే ప్రదర్శన చేయాలని రాష్ట్రపతి ప్రణబ్  ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement