టైటిల్ పోరుకు ప్రణయ్ | pranay plays for the title | Sakshi
Sakshi News home page

టైటిల్ పోరుకు ప్రణయ్

Sep 14 2014 1:07 AM | Updated on Sep 2 2017 1:19 PM

టైటిల్ పోరుకు ప్రణయ్

టైటిల్ పోరుకు ప్రణయ్

పాలెమ్‌బాంగ్: భారత యువ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ వరుసగా రెండో టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

పాలెమ్‌బాంగ్: భారత యువ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ వరుసగా రెండో టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఐదో సీడ్ ప్రణయ్ 21-14, 14-21, 21-14తో తొమ్మిదో సీడ్ డారెన్ లూ (మలేసియా)పై విజయం సాధించాడు. గతవారం జరిగిన వియత్నాం ఓపెన్‌లో ప్రణయ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. డారెన్‌తో దాదాపు గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌లో 5-8తో వెనుకబడ్డా 12-12తో స్కోరును సమం చేసి ముందుకు దూసుకెళ్లాడు. అయితే రెండో గేమ్ ఆరంభంలో 7-3 ఆధిక్యంలో ఉన్న ప్రణయ్‌ను మలేసియా ఆటగాడు కట్టడి చేయడంతో పుంజుకోలేకపోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్ 5-0, 11-9తో ఆధిక్యంలో నిలిచాడు. డారెన్ ఒత్తిడి పెంచినా ఏమాత్రం తడబడకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ప్రణయ్... అబ్దుల్ కోలిక్ (ఇండోనేసియా)తో తలపడతాడు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement