
‘కంగారు’ పడ్డారు
లక్ష్యం 192 పరుగులు... ఆస్ట్రేలియా స్కోరు 126/2... ఇక 51 బంతుల్లో 66 పరుగులు చేస్తే చాలు... ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియా తడబడింది. మ్యాక్స్‌వెల్ సంచలన ఇన్నింగ్స్‌తో విజయానికి కావలసిన వేదికను సిద్ధం చేసినా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఒత్తిడిలో చేతులెత్తేశారు.
ఆసీస్‌పై పాకిస్థాన్ విజయం
ఉమర్ అక్మల్ సూపర్ ఇన్నింగ్స్
మ్యాక్స్‌వెల్ మెరుపులు వృథా
లక్ష్యం 192 పరుగులు... ఆస్ట్రేలియా స్కోరు 126/2... ఇక 51 బంతుల్లో 66 పరుగులు చేస్తే చాలు... ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియా తడబడింది. మ్యాక్స్‌వెల్ సంచలన ఇన్నింగ్స్‌తో విజయానికి కావలసిన వేదికను సిద్ధం చేసినా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఒత్తిడిలో చేతులెత్తేశారు. దాంతో ఆస్ట్రేలియా 16 పరుగుల తేడాతో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది.
ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
సెమీస్ అవకాశాలను కాపాడుకోవడానికి కచ్చితంగా గెలిచి తీరాల్సిన స్థితిలో పాకిస్థాన్ స్ఫూర్తిదాయకంగా ఆడింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ సంచలన బ్యాటింగ్‌తో భయపెట్టినా... ఒత్తిడిని ఎదుర్కొని పాక్ గట్టెక్కింది. ఆదివారం జరి గిన సూపర్-10 గ్రూప్ ‘2’ లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 16 పరుగులతో ఆస్ట్రేలియాను ఓడించింది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా... పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఉమర్ అక్మల్ (54 బంతుల్లో 94; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కొద్దిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. ఉమర్ అన్నయ్య కమ్రాన్ అక్మల్ (31 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 8.3 ఓవర్లలోనే 96 పరుగులు జోడించడం విశేషం. చివర్లో ఆఫ్రిది (11 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడాడు. ఆసీస్ ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేశారు.
ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటయింది. ఓపెనర్ ఫించ్ (54 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) నాణ్యమైన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేశాడు. మ్యాక్స్‌వెల్ (33 బంతుల్లో 74; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఫించ్, మ్యాక్స్‌వెల్ కేవలం 64 బంతుల్లో 118 పరుగులు జోడించారు. అయితే ఆఫ్రిది బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ అవుటైన తర్వాత ఆస్ట్రేలియా లక్ష్యఛేదనలో తడబడింది. పాక్ బౌలర్లలో గుల్, బాబర్, ఆఫ్రిది, భట్టి రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఉమర్ అక్మల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు
పాకిస్థాన్ ఇన్నింగ్స్: షెహ్‌జాద్ (సి అండ్ బి) బొలింజర్ 5; కమ్రాన్ అక్మల్ (సి) వార్నర్ (బి) నైల్ 31; హఫీజ్ (బి) వాట్సన్ 13; ఉమర్ అక్మల్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 94; మక్సూద్ (బి) నైల్ 5; ఆఫ్రిది నాటౌట్ 20; మాలిక్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 191
వికెట్ల పతనం: 1-7; 2-25; 3-121; 4-147; 5-180
బౌలింగ్: స్టార్క్ 4-0-35-1; బొలింజర్ 4-0-28-1; వాట్సన్ 4-0-38-1; నైల్ 4-0-36-2; హాగ్ 3-0-29-0; ఫించ్ 1-0-18-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) బాబర్ 4; ఫించ్ (బి) అజ్మల్ 65; వాట్సన్ (సి) కమ్రాన్ (బి) బాబర్ 4; మ్యాక్స్‌వెల్ (సి) షెహ్‌జాద్ (బి) ఆఫ్రిది 74; బెయిలీ (బి) ఆఫ్రిది 4; హాడ్జ్ (సి) అజ్మల్ (బి) గుల్ 2; హాడిన్ (సి) మాలిక్ (బి) భట్టి 8; కౌల్టర్ నైల్ (బి) గుల్ 0; స్టార్క్ రనౌట్ 3; హాగ్ (బి) భట్టి 3; బొలింజర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 175
వికెట్ల పతనం: 1-4; 2-8; 3-126; 4-146; 5-155; 6-162; 7-163; 8-172; 9-173; 10-175.
బౌలింగ్: బాబర్ 4-0-26-2; హఫీజ్ 2-0-18-0; గుల్ 4-0-29-2; అజ్మల్ 4-0-33-1; ఆఫ్రిది 4-0-30-2; భట్టి 2-0-36-2.