పాకిస్తాన్‌ యాడ్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌..! | Pakistan Advert On Abhinandan Indian YouTube Stars Awesome Counter | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ యాడ్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌..!

Jun 15 2019 6:37 PM | Updated on Jun 15 2019 6:59 PM

Pakistan Advert On Abhinandan Indian YouTube Stars Awesome Counter - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌-పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక దాయాదుల పోరు నేపథ్యంలో అటు అభిమానులు, ఇటు ఆటగాళ్లు ‘సమరమే ’ అంటూ రంగంలోకి దిగుతారు. సోషల్‌ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఇండియన్‌ హీరో, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను అవమానిస్తూ పాకిస్తాన్‌కు చెందిన జాజ్‌టీవీ ఓ యాడ్‌ రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘వీ సెవెన్‌ పిక్చర్స్‌’ యూట్యూబ్‌ ఛానెల్‌ పాకిస్తాన్‌ యాడ్‌కు కౌంటర్‌గా ఓ వీడియో రూపొందించి శభాష్‌ అనిపించుకుంది.
(వైరల్‌ : కప్పు లాక్కెళ్లిపోయిన పాకిస్తాన్‌..!)

వీడియో ప్రకారం.. ఓ సెలూన్‌ షాప్‌లో షేవింగ్‌ చేసుకుని టీమిండియా ఆటగాడొకరు టీవీలో యువరాజ్‌సింగ్‌ ఆటను ఆస్వాదిస్తుంటాడు. కొందరు ఆటగాళ్లని మర్చిపోలేం అంటాడు. అంతలోనే పాక్‌ ఆటగాడొకరు లోనికి వస్తాడు. అతనివైపు చూసి మరికొందరినీ మర్చిపోవాలి అనుకుంటాం అంటాడు. ఇండియన్‌ ఆటగాడికి ఫాదర్స్‌డే శుభాకాంక్షలు చెప్పిన పాక్‌ ఆటగాడు.. చేతి రుమాలుని గిఫ్ట్‌గా ఇస్తాడు. ఓడిపోయిన తర్వాత ముఖం దాచుకోవడానికి ఈ కర్చీఫ్‌ ఉపయోగపడుతుంది డాడీ అంటూ ఎగతాళిగా మాట్లాడతాడు. అనంతరం  హెయిర్‌ స్టైలిస్ట్‌ని షేవ్‌ చేయమంటాడు. పాక్‌ ఆటగాడి వెకిలి చేష్టలతో అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఇండియన్‌ క్రికెటర్‌, హెయిర్‌ స్టైలిస్ట్‌ వైపు చూసి ఓ సైగ చేస్తాడు.
(చదవండి : ట్రెండింగ్‌లో అభినందన్‌ ‘గన్‌స్లింగర్‌’..!)

దాంతో పాక్‌ ఆటగాడి కళ్లపై దోసకాయ ముక్కల్ని పెట్టి.. షేవింగ్‌ కానిచ్చేస్తాడు. ఆఫ్రిదిలా ఉన్నానా..? అంటూ పాక్‌ ఆటగాడు ఆనందంతో అడుగుతాడు. అద్దంలో ముఖం చూసుకుని బిత్తరపోతాడు. తను చెప్పిన విధంగా కాకుండా.. అభినందన్‌ గన్‌స్లింగర్‌ మీసంతో షేవ్‌ చేశావేంటని ప్రశ్నిస్తాడు. అది మా నేషనల్‌ హీరో అభినందన్‌ స్టైల్‌ అంటాడు హెయిర్‌ స్టైలిస్ట్‌. ఇప్పుడు బయటికి వెళ్లడం ఎలా అని పరేషాన్‌ అవుతున్న పాక్‌ ఆటగాడికి కర్చీఫ్‌ ఇచ్చి ఇప్పుడు మఖం దాచుకోపో అంటాడు టీమిండియా ఆటగాడు. బిడ్డకు ఏం కావాలో తండ్రికి తెలుసు.. మీకు ప్రపంచకప్‌ అవసరం లేదు, అభినందన్‌ టీకప్పు చాలు అని అర్థం అయింది అంటాడు టీమిండియా ఆటగాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌ పాక్‌ వన్డే మ్యాచ్‌ ఆదివారం మాంచెస్టర్‌లో జరుగనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement