సెమీస్‌లో నవీన్, అంకిత్‌ | Naveen Boora, Ankit enter medal rounds of Asian Youth boxing | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో నవీన్, అంకిత్‌

Jul 4 2017 12:00 AM | Updated on Sep 5 2017 3:06 PM

ఆసియా యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నవీన్‌ బూర (69 కేజీలు), అంకిత్‌ (60 కేజీలు) సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకాన్ని ఖాయం చేసుకున్నారు.

బ్యాంకాక్‌: ఆసియా యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నవీన్‌ బూర (69 కేజీలు), అంకిత్‌ (60 కేజీలు) సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకాన్ని ఖాయం చేసుకున్నారు. క్వార్టర్‌ ఫైనల్లో హరియాణా బాక్సర్‌ నవీన్‌... చైనాకు చెందిన హువాంగ్‌ రూయిపై, అంకిత్‌... కిర్గిస్తాన్‌ బాక్సర్‌ అడిలెట్‌ ఎగెన్‌బెర్ది వులుపై విజయం సాధించారు. సెమీస్‌లో అంకిత్‌... సక్దా రుమ్తామ్‌ (మంగోలియా)తో, నవీన్‌... యిసుంగ్‌నొయెన్‌ (ఇరాన్‌)తో తలపడతారు. అయితే సుదీప్‌ (52 కేజీలు), ఆశిష్‌ (81 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో ఓడారు. సుదీప్‌... టిముర్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో, ఆశిష్‌... నగగకి (జపాన్‌) చేతిలో ఓడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement