
‘‘ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో జరిగే కథ ‘బ్యూటీ’ సినిమా. అందరికీ తెలిసిన కథే. అయినా సరే అందరూ తెలుసుకోవాల్సిన కథ. ప్రస్తుతం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజెప్పే కథ ఇది. మధ్య తరగతి తండ్రి భావోద్వేగాలను చూపించాం’’ అని అంకిత్ కొయ్య చెప్పారు. జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వంలో అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన చిత్రం ‘బ్యూటీ’.
వానర సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతి టీమ్ ప్రోడక్ట్‌పై అడిదల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. అంకిత్ మాట్లాడుతూ–‘‘నేను నటించిన అర్జున్ పాత్రని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాను. అయితే.. ఓ నటుడిగా ఆ పాత్రకు న్యాయం చేయాలని నటించాను’’ అని చెప్పారు.