ఐఓఏ కొత్త అధ్యక్షుడిగా నరీందర్‌ బాత్రా

Narinder Batra as IOA new president - Sakshi

న్యూఢిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడిగా నరీందర్‌ బాత్రా ఎన్నికయ్యారు. నామమాత్రమైన ఎన్నికల ప్రహసనంలో ఆయనకు 142 ఓట్లు పడగా... అనిల్‌ ఖన్నాకు 13 ఓట్లు వచ్చాయి. నిజానికి ఖన్నా అధ్యక్ష పదవికి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. గడువు ముగిశాక ఈ పని చేయడంతో ఆయన అయిష్టంగా బరిలో ఉండాల్సి వచ్చింది. గురువారం ఇక్కడ జరిగిన ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్‌ అయిన 60 ఏళ్ల బాత్రా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తెలిపారు.

కార్యదర్శిగా రాజీవ్‌ మెహతా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికవగా, కోశాధికారి ఆనందీశ్వర్‌ పాండే గెలిచారు. నూతన కార్యవర్గం నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటుంది. ఐఓఏ కొత్త అధ్యక్షుడు బాత్రా మాట్లాడుతూ... 2026 కామన్వెల్త్‌ గేమ్స్, 2030 ఆసియా క్రీడలు, 2032 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల పోటీలో ఉండేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top