ఓడినా.. వరల్డ్ రికార్డు సాధించారు | Mumbai Indians lose to Rising Pune Supergiant but set world record | Sakshi
Sakshi News home page

ఓడినా.. వరల్డ్ రికార్డు సాధించారు

Apr 25 2017 7:29 PM | Updated on Sep 5 2017 9:40 AM

ఓడినా.. వరల్డ్ రికార్డు సాధించారు

ఓడినా.. వరల్డ్ రికార్డు సాధించారు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ వరల్డ్ రికార్డు సాధించింది.

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ వరల్డ్ రికార్డు సాధించింది.  పొట్టి ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.  సోమవారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరిగిన మ్యాచ్ ముంబైకు 170వ మ్యాచ్. తద్వారా ప్రపంచంలోని పొట్టి క్రికెట్ లీగ్ల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జట్టుగా ముంబై గుర్తింపు సాధించింది. ఈ క్రమంలోనే ఇంగ్లిష్ జట్టు సోమర్సెట్ను  వెనక్కు నెట్టింది.  సోమర్ సెట్ 169 మ్యాచ్ లు ఆడగా, దాన్ని ముంబై సవరించింది.

 

నిన్నటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడినప్పటికీ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకోవడం జట్టులోని సభ్యులకు ఊరటనిచ్చే అంశం. ఇక మూడో స్థానంలో మరో ఇంగ్లిష్ జట్టు హాంప్ షైర్(166) ఉండగా, నాల్గో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(162) నిలిచింది. ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్ ఆడిన 170 మ్యాచ్ ల్లో 97 విజయాల్ని ఆ జట్టు సాధించగా, 71 పరాజయాల్ని మూటగట్టుకుంది. మరో రెండింటిలో ఫలితం తేలలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement