మరి వార్నర్‌ సంగతేంటి? | Mohammad Kaif Says Will David Warner too not captain Hyderabad | Sakshi
Sakshi News home page

Mar 26 2018 4:36 PM | Updated on Mar 26 2018 4:40 PM

Mohammad Kaif Says Will David Warner too not captain Hyderabad - Sakshi

డెవిడ్‌ వార్నర్‌

సాక్షి, హైదరాబాద్‌: బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ..  నూతన కెప్టెన్‌గా టీమిండియా క్రికెటర్, అజింక్యా రహానేను నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంతో సంబంధమున్న మరో ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ సంగతేంటని టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించాడు.ఔ

‘రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా స్మిత్‌ కొనసాగడం లేదా.. నిజంగా ఇది ఆసక్తికరమైన విషయమే..ఊహించని ఘటన కూడా. డెవిడ్‌ వార్నర్‌ను సన్‌ రైజర్స్‌ కెప్టెన్సీ నుంచి తొలగించరా..? ఒక వేళ వార్నర్‌ను తొలగిస్తే.. మొత్తం 8 జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్‌గా ఉంటారు’ అని కైఫ్‌ ట్వీట్‌ చేశాడు. 

దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ సందర్భంగా స్మిత్‌ బాల్ ట్యాంపరింగ్‌కు జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐసీసీ ఓ టెస్ట్‌ మ్యాచ్‌ నిషేధంతో పాటు, మ్యాచ్‌ ఫీజు 100 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకుంది. మరో వైపు స్మిత్‌, వార్నర్‌లను తమ బాధ్యతల నుంచి తప్పించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ), ఈ ఇద్దరితో​ పాటు ట్యాంపరింగ్‌కు యత్నించిన బెన్‌క్రాఫ్ట్‌లపై జీవిత కాల నిషేధం విధించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఐసీసీ తీసుకున్న చర్యలపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement