సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్‌కైఫ్ తన ఆల్‌టైం జట్టులో దివాల్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కు స్థానం కల్పించలేదు. తాజాగా మాజీ క్రికెటర్లతో జరిగిన ఐస్ క్రికెట్ టోర్నీలో కైఫ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులతో కైఫ్ ట్విటర్ వేదికగా చిట్ చాట్ నిర్వహించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు కైఫ్ సమాధానం ఇచ్చారు.
‘2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో యువరాజ్, మీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ స్లెడ్జింగ్ పాల్పడ్డారా? ’అని ఒకరు ప్రశ్నించగా.. ‘ ఆ సమయంలో నాసర్ తనను బస్ డ్రైవర్ అని పిలిచాడని, దానికి యువీ, నేను కలిసి మ్యాచ్ అనంతరం రైడ్‌కు తీసుకెళ్తాం అని సమాధానమిచ్చాం’ అని కైఫ్ పేర్కొన్నాడు.
సచిన్, సెహ్వాగ్, గంగూలీ, విరాట్, యువరాజ్, ధోని, కపిల్‌దేవ్, హర్భజన్, జహీర్, కుంబ్లే, శ్రీనాధ్‌లు తన ఆల్‌టైం భారతజట్టు సభ్యులని కైఫ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో దివాల్ ద్రవిడ్ లేకపోవడం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయంపై అభిమానులు కైఫ్‌ను నిలదీస్తున్నారు.
కాజోల్ అభిమాన నటి, సచిన్ ఫెవరేట్ క్రికెటర్, జాంటీ రోడ్స్ తన ఆల్‌టైం బెస్ట్ ఫీల్డర్ అని కైఫ్ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ అవుతారా అని ప్రశ్నించగా.. ఆ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు. ‘ఒకప్పటి లెజండరీ ఫీల్డర్, ఎప్పటికీ లెజండరీ ఫీల్డర్, ఫినిషరే’ అని ఈ మధ్యే జరిగిన ఐస్ క్రికెట్ సందర్భంగా పాక్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ అనడం’ తానందుకున్న గొప్ప కాంప్లిమెంట్ అని కైఫ్ ఆనందం వ్యక్తం చేశాడు.
Sachin
— Mohammad Kaif (@MohammadKaif) 27 February 2018
Sehwag
Ganguly
Virat
Yuvraj
Dhoni
Kapil Dev
Harbhajan
Zaheer
Kumble
Srinath https://t.co/SCe2jyeJmK


