బ్యాడ్‌లక్... కొద్దిలో సెంచరీ మిస్‌! | Misbah-ul-Haq left stranded on 99 | Sakshi
Sakshi News home page

బ్యాడ్‌లక్... కొద్దిలో సెంచరీ మిస్‌!

Apr 25 2017 10:50 AM | Updated on Sep 5 2017 9:40 AM

బ్యాడ్‌లక్... కొద్దిలో సెంచరీ మిస్‌!

బ్యాడ్‌లక్... కొద్దిలో సెంచరీ మిస్‌!

చివరి టెస్ట్ సిరీస్‌ ఆడుతున్న పాకిస్థాన్ టెస్టు కెప్టెన్‌ మిస్బా-వుల్‌-హక్‌ను దురదృష్టం వెంటాడింది.

జమైకా: చివరి టెస్ట్ సిరీస్‌ ఆడుతున్న పాకిస్థాన్ టెస్టు కెప్టెన్‌ మిస్బా-వుల్‌-హక్‌ను దురదృష్టం వెంటాడింది. టెస్టుల్లో 11 సెంచరీ ఒక్క పరుగు తేడాతో దూరమైంది. వెస్టిండీస్‌ తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌ లో పాకిస్తాన్ 407 పరుగులకు ఆలౌటైంది. మిస్బా ఒక్క పరుగు తేడాతో శతకం కోల్పోయాడు. 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి అండగా నిలిచే బ్యాట్స్ మన్‌ లేకపోవడంతో సెంచరీ చేయలేకపోయాడు. చివరి బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ అబ్బాస్‌ ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ కావడంతో శతకానికి ఒక్క దూరంలో మిస్బా నిలిచిపోయాడు. అయితే పాకిస్తాన్‌ ఇంకా రెండో ఇన్నింగ్స్‌ ఆడాల్సివుంది. విండీస్‌ మరో రెండు టెస్టులు కూడా ఆడనుంది.

కాగా, టెస్టుల్లో సెంచరీ దగ్గర ఆగిపోయిన పాకిస్తాన్ తొలి క్రికెటర్‌ గా మిస్బా గుర్తింపు పొందాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఈ విధంగా సెంచరీకి దూరమైన ఆరో బ్యాట్స్‌ మన్‌ గా నిలిచాడు. గతంలో జెఫ్రీ బాయ్‌కాట్‌, స్టీవ్‌ వా, అలెక్స్‌ టుడర్‌, షాన్‌ పొలాక్‌, ఆండ్రూ హాల్ ఇదేవిధంగా సెంచరీ చేజార్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement