వారెవ్వా.. పాండే సూపర్‌ క్యాచ్‌!

Manish Pandey Super Catch Against Pakistan At Asia Cup 2018 - Sakshi

దుబాయ్‌: ఆసియాకప్‌లో భాగంగా దాయాదీ పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్‌ మనీష్‌ పాండే అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. కేదార్‌ జాదవ్‌ వేసిన 25 ఓవర్‌ ఐదో బంతిని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్‌ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే ఆ దిశగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న మనీష్‌ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్‌ కోల్పోతున్నట్లు భావించిన పాండే బంతిని గాల్లోకి విసిరేసి బౌండరీ లైన్‌ను దాటి వచ్చి క్యాచ్‌ అందుకున్నాడు. ఈ అద్భుత ఫీట్‌తో మైదానంలోని ప్రేక్షకులు.. ఆటగాళ్లు థ్రిల్‌ అయ్యారు. దీంతో సర్ఫరాజ్‌ (6) పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌ తుది జట్టులో లేని పాండే ఆల్‌రౌండర్‌ హర్ధిక్‌ పాండ్యా గాయపడటంతో అతని స్థానంలో ఫీల్డింగ్‌కు వచ్చాడు. 

రాయుడు అద్భుత త్రో..
క్రీజులో పాతుకుపోయి.. అప్పటికే ఓ లైఫ్‌ దక్కించుకొని ప్రమాదకరంగా మారుతున్న మాలిక్‌(43)ను అంబటి రాయుడు అద్బుత ఫీల్డింగ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. జాదవ్‌ వేసిన 27వ ఓవర్‌ చివరి బంతికి మాలిక్‌ (43) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. రాయుడు విసిరిన బంతి డైరెక్ట్‌గా వికెట్లను తాకడం విశేషం. దీంతో పాక్‌ 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ వెంటనే అసిఫ్‌ అలీ కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top