కోల్‌కతా మెరుపులు | kolkata wins against rising pune supergaints | Sakshi
Sakshi News home page

కోల్‌కతా మెరుపులు

Apr 26 2017 11:19 PM | Updated on Sep 5 2017 9:46 AM

కోల్‌కతా మెరుపులు

కోల్‌కతా మెరుపులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్-10లో భాగంగా బుధవారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది.

పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్-10లో భాగంగా బుధవారం రాత్రి  కోల్ కతా నైట్ రైడర్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. టాస్‌ గెలిచిన కోల్‌కతా జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పుణె బ్యాట్స్‌మన్లు సమయోచితంగా ఆడి 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

చక్కని టార్గెట్‌ను ప్రత్యర్థి ముందు ఉంచినా.. దాన్ని కాపాడుకోలేక చతికిలపడింది పుణె. కోల్‌కతా బ్యాట్స్‌మన్లు ఆది నుంచి ధాటిగా ఆడుతూ చెత్త బంతులను బౌండరీలుగా మలిచారు. లేని పరుగు కోసం యత్నించి సునీల్‌ నరైన్‌(16, 11 బంతుల్లో 3 ఫోర్లు) అవుడయ్యాడు. ఆ తర్వాత కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఉతప్ప(87, 47 బంతుల్లో 6 సిక్సులు, 7 ఫోర్లు) ఆఖర్లో క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే అప్పటివరకూ ఉతప్పకు అండగా నిలబడి జట్టును విజయపథంలో నడిపించిన కోల్‌కతా కెప్టెన్‌ గంభీర్‌(62, 46 బంతుల్లో 1 సిక్సు, 6 ఫోర్లు) కూడా ఔటయ్యాడు. అయినప్పటికీ కోల్‌కతా విజయం అప్పటికే ఖాయం కావడంతో తర్వాత వచ్చిన డారెన్‌ బ్రేవో(6, 5 బంతులు ఒక ఫోర్‌)తో మిగిలిన పని కానిచ్చేశాడు.

పుణె ఓపెనర్లు అజింక్యా రహానే(46;41 బంతుల్లో4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి(38;23 బంతుల్లో 7 ఫోర్లు) మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడి 65 పరుగుల జత చేసిన తరువాత త్రిపాఠి తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో రహానేకు జత కలిసిన కెప్టెన్ స్మిత్ కుదురుగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 47 పరుగులు జోడించిన తరువాత రహానే పెవిలియన్ కు చేరాడు. సునీల్ నరైన్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడిన రహానే స్టంప్ అవుట్ అయ్యాడు.

ఆపై స్మిత్-ధోనిలు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే స్కోరును పెంచే క్రమంలో ధోని(23;11 బంతుల్లో1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడబోయి మూడో వికెట్ గా అవుటయ్యాడు. కాగా, ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో స్మిత్(51 నాటౌట్;37 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించగా, క్రిస్టియన్(16) ఫర్వాలేదనిపించాడు. ఓవరాల్ గా పుణె బ్యాట్స్ మెన్ రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కు రెండు వికెట్లు లభించగా, ఉమేశ్ యాదవ్,సునీల్ నరైన్లకు తలో వికెట్ దక్కింది. పుణె బౌలర్లలో జయదేవ్‌ ఉనాద్కట్‌, డానియెల్‌ క్రిస్టియన్లకు చెరో వికెట్‌ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement