డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది.
కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ 1-0తో కోల్‌కతాకు షాకిచ్చింది.
90వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ డాస్ సాంటోస్ గోల్ చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌లో పుణేతో గోవా తలపడుతుంది.