
‘రన్ కేరళ రన్’లో సచిన్!
కేరళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జనవరిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘రన్ కేరళ రన్’ ఈవెంట్‌లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పాల్గొనే అవకాశాలున్నాయి.
తిరువనంతపురం: కేరళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జనవరిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘రన్ కేరళ రన్’ ఈవెంట్‌లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పాల్గొనే అవకాశాలున్నాయి. ‘ఈ పోటీని రాష్ట్ర వ్యాప్తంగా 7వేల సెంటర్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే తేదీ ఇంకా ఖరారు కాలేదు.
సచిన్‌కు ఎప్పుడు వీలు చిక్కుతుందో దానిపై ఇది ఆధారపడి ఉంది. మేమైతే జనవరి 20, 21, 22 తేదీలను ఈవెంట్ కోసం ఆయనకు సూచించాం’ అని కేరళ క్రీడా మంత్రి తిరువంచూర్ రాధాక్రిష్ణన్ చెప్పారు. అలాగే జనవరి 31నుంచి కేరళలోనే ప్రారంభమయ్యే జాతీయ క్రీడలకు సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.