ఐఎస్‌ఎల్ సెమీస్‌లో గోవా | ISL: FC Goa thrash Chennayin FC 3-1 to seal semifinal berth | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్ సెమీస్‌లో గోవా

Dec 6 2014 12:40 AM | Updated on Sep 2 2017 5:41 PM

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

చెన్నైయిన్‌పై 3-1తో విజయం
 చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం చెన్నైయిన్ ఎఫ్‌సీతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 3-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఇది గోవాకు వరుసగా నాలుగో విజయం.
 
 ఇప్పటికే సెమీస్‌కు చేరిన చెన్నైయిన్‌పై గోవా ఆద్యంతం ఆధిక్యం ప్రదర్శించింది. 23వ నిమిషంలో రోమియో గోల్ చేయగా 41వ నిమిషంలో సాంటోస్ గోల్ చేశాడు. ద్వితీయార్ధం 62వ నిమిషంలో స్లెపికా గోల్‌తో గోవా 3-0 ఆధిక్యం సాధించగా... 90వ ని.లో మారిస్ చెన్నైకి గోల్ అందించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement