
ఆమె 160... తొమ్మిది మంది 0 !
దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో ఆసక్తికర గణాంకాలు నమోదయ్యాయి.
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో ఆసక్తికర గణాంకాలు నమోదయ్యాయి. దేశవాళీ అండర్–19 టోర్నీ టి20 మ్యాచ్‌లో ఒకే బ్యాట్స్‌విమన్ 160 పరుగులు చేయగా, జట్టులోని ఎనిమిది మంది డకౌట్‌గా వెనుదిరిగారు. ఈస్టర్న్ ఉమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్యూమలాంగా టీమ్ ప్లేయర్ షానియా–లీ స్వార్ట్ ఈ ఘనత సాధించిం ది. 86 బంతులు ఎదుర్కొన్న షానియా 18 ఫోర్లు, 12 సిక్సర్లతో 160 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
అటువైపు క్రీజ్‌లోకి దిగిన తొమ్మిది మంది ఇతర బ్యాట్స్‌విమెన్ మొత్తం కలిపి 35 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. 9 ఎక్స్‌ట్రాలతో కలిపి జట్టు స్కోరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులకు చేరింది. అనంతరం ఈస్టర్న్ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 127 మాత్రమే చేసి 42 పరుగులతో ఓటమిపాలైంది