
సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్): గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌కు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన ఏడో రౌండ్‌లో గుకేశ్ 52 ఎత్తుల్లో ఇదిజ్ గురెల్ (టర్కీ) చేతిలో ఓడిపోయాడు. ఐదో రౌండ్‌లో అభిమన్యు మిశ్రా (అమెరికా) చేతిలో, ఆరో రౌండ్‌లో నికోలస్ (గ్రీస్) చేతిలో ఓడిన గుకేశ్ ... ఏడో రౌండ్ తర్వాత మూడు పాయింట్లతో 84వ స్థానంలో ఉన్నాడు.
మరోవైపు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తొలి పరాజయాన్ని చవిచూశాడు. మథియాస్ బ్లూబామ్ (జర్మనీ)తో జరిగిన గేమ్‌లో అర్జున్ 51 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఓపెన్ విభాగంలో పోటీపడుతున్న భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ రెండో విజయం అందుకుంది. ఇవిచ్ వెల్మిర్ (సెర్బియా)తో జరిగిన గేమ్‌లో దివ్య 49 ఎత్తుల్లో గెలిచింది.