నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ తొలి ఓటమి

Indian Super League Is The First Defeat For NorthEast United - Sakshi

గువాహటి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌లో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీకి తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ 0–3 గోల్స్‌ తేడాతో అట్లెటికో డి కోల్‌కతా చేతిలో పరాజయం పాలైంది. రాయ్‌ కృష్ణ (35వ, 90+4వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... డేవిడ్‌ విలియమ్స్‌ (11వ నిమిషంలో) గోల్‌ చేశాడు. ఆట ఆరంభంలో నార్త్‌ఈస్ట్‌ ప్రధాన ఆటగాడు అసమో జ్యాన్‌ గాయం కారణంగా మైదానాన్ని వీడటం ఆ జట్టు ఆటతీరుపై ప్రభావం చూపింది. నేటి మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీతో హైదరాబాద్‌ ఎఫ్‌సీ తలపడుతుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top