చెత్రి కనీస ధర రూ.80 లక్షలు | Indian super league | Sakshi
Sakshi News home page

చెత్రి కనీస ధర రూ.80 లక్షలు

Jul 10 2015 1:04 AM | Updated on Oct 2 2018 8:39 PM

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) టోర్నమెంట్‌కు తొలిసారిగా నేడు (శుక్రవారం) ఆటగాళ్ల వేలం జరుగనుంది. భారత నంబర్‌వన్ ఫుట్‌బాలర్ సునీల్ చెత్రి ఈ వేలానికి అందుబాటులో ఉండనున్నాడు.

ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) టోర్నమెంట్‌కు తొలిసారిగా నేడు (శుక్రవారం) ఆటగాళ్ల వేలం జరుగనుంది. భారత నంబర్‌వన్ ఫుట్‌బాలర్ సునీల్ చెత్రి ఈ వేలానికి అందుబాటులో ఉండనున్నాడు. దీంతో అన్ని ఫ్రాంచైజీల దృష్టి ఈ స్టార్ స్ట్రయికర్‌పైనే ఉంది. అందుకు తగ్గట్టుగానే అతడి కనీస ధర అత్యధికంగా రూ.80 లక్షలుగా ఉంది. అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 6 వరకు ఈ రెండో సీజన్ జరుగుతుంది.
 
  చెత్రితో పాటు కరణ్‌జీత్ సింగ్ (రూ.60 లక్షలు), అనాస్ ఎడతోడ్కియా, అరాటా ఇజుమి, రాబిన్ సింగ్ (రూ. 40 లక్షలు), తోయి సింగ్ (రూ. 39 లక్షలు), లింగ్డో (రూ. 27.50 లక్షలు), జాకీచంద్ సింగ్, సత్యసేన్ సింగ్ (రూ. 20 లక్షలు), రినో ఆంటో (రూ.17.50 లక్షలు)లకు డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement