సచిన్ సాధన! | Indian Premier League: Sachin Tendulkar monitors Mumbai Indians training ahead of opener | Sakshi
Sakshi News home page

సచిన్ సాధన!

Apr 16 2014 12:57 AM | Updated on Sep 2 2017 6:04 AM

సచిన్ సాధన!

సచిన్ సాధన!

ఒకటా...రెండా...దాదాపు పాతికేళ్లు అతనికి క్రికెట్టే ప్రపంచం. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా తన అస్త్రాలు వదిలి ఆటకు దూరం కాగలడా...ఇతరుల సంగతేమో కానీ సచిన్ టెండూల్కర్‌కు మాత్రం అది సాధ్యం కావడం లేదు.

అబుదాబి: ఒకటా...రెండా...దాదాపు పాతికేళ్లు అతనికి క్రికెట్టే ప్రపంచం. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా తన అస్త్రాలు వదిలి ఆటకు దూరం కాగలడా...ఇతరుల సంగతేమో కానీ సచిన్ టెండూల్కర్‌కు మాత్రం అది సాధ్యం కావడం లేదు. అందుకే ఐకాన్‌గా ఉంటూ సూచనలిస్తే చాలని ముంబై ఇండియన్స్ బాధ్యతలు అప్పగిస్తే, తాను మాత్రం మరో విధంగా ఆలోచిస్తున్నాడు.
 
 మంగళవారం ఇక్కడ జరిగిన ముంబై జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో మాస్టరే హైలైట్‌గా నిలిచాడు. మ్యాచ్‌లో తానే ఆడబోతున్నాడా అన్నట్లుగా అతను అరగంటకు పైగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తనకు అలవాటైన రీతిలో సహాయక సిబ్బందికి ‘త్రో’ విసరమని చెప్పి మరీ సాధన చేశాడు. తన కెరీర్ సమయంలో ఎలా ప్రాక్టీస్ చేసేవాడో అదే తరహాలో  సీరియస్‌గా సాధన చేయడం ముంబై జట్టును కూడా ఆశ్చర్య పరచింది.
 

Advertisement
 
Advertisement
Advertisement