చెలరేగిన భారత స్పిన్ త్రయం | India spinners skittle opposition for 180 | Sakshi
Sakshi News home page

చెలరేగిన భారత స్పిన్ త్రయం

Jul 15 2016 2:49 PM | Updated on Sep 4 2017 4:56 AM

చెలరేగిన భారత స్పిన్ త్రయం

చెలరేగిన భారత స్పిన్ త్రయం

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు.

సెయింట్ కిట్స్: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు.  భారత స్పిన్ త్రయం దెబ్బకు విండీస్ ఎలెవన్ విలవిల్లాడింది.  రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రాలు విశేషంగా రాణించడంతో బోర్డు ఎలెవన్ తమ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకే కుప్పకూలింది.  అశ్విన్,  జడేజాలు తలో మూడు వికెట్లు సాధించగా,  అమిత్ మిశ్రా రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

విండీస్ ఆటగాళ్లలో క్యాంప్‌బెల్ (34), బ్లాక్‌వుడ్ (36), కోర్న్ వాల్(41)లు ఫర్వాలేదనిపించగా,  మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో మురళీ విజయ్(23), శిఖర్ ధవన్(9), చటేశ్వర పూజారా(28)లు పెవిలియన్ కు చేరారు. కేఎల్ రాహుల్(30) క్రీజ్లో ఉన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement