అఫ్ఘనిస్తాన్‌ తొలి టెస్ట్‌ భారత్‌తోనే | India to Host Afghanistan For First-Ever Test | Sakshi
Sakshi News home page

అఫ్ఘనిస్తాన్‌ తొలి టెస్ట్‌ భారత్‌తోనే

Dec 11 2017 6:58 PM | Updated on Mar 28 2019 6:10 PM

India to Host Afghanistan For First-Ever Test - Sakshi

న్యూఢిల్లీ : క్రికెట్‌లో కూన దేశమైన అప్ఘనిస్తాన్‌ తన చారిత్రాత్మక తొలి టెస్టును భారత్‌తో ఆడనుందని బీసీసీఐ  ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు భారతే ఆతిథ్యం ఇవ్వనుందని, షెడ్యూల్‌ తేదీలను త్వరలో ప్రకటిస్తామని బీసీసీఐ తాత్కలిక సెక్రటరీ అమితాబ్‌ చౌదరీ తెలిపారు. సోమవారం జరిగిన బీసీసీఐ అధికారుల ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక 2019-2023 ఎఫ్‌టీపీ( ప్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌) ప్రకారం మూడు ఫార్మట్లలో కలిపి భారత్‌లో 81 మ్యాచ్‌లు జరుగుతాయన్నారు.

నిజానికి అఫ్ఘనిస్తాన్‌ తన తొలి టెస్టు మ్యాచ్‌ను 2019లో ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉందని, కానీ భారత్‌-అఫ్ఘనిస్తాన్‌ చారిత్రాత్మక సంబంధాల నేపథ్యంలో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ భారత్‌తో ఆడేట్లు నిర్ణయం తీసుకున్నామని అమితాబ్‌ చౌదరీ తెలిపారు. అలాగే వచ్చే ఎఫ్‌టీపీ సైకిల్‌లో భారత్‌లో పెద్ద జట్లైన ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలు పర్యటిస్తాయన్నారు. రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై నిషేదం ఎత్తివేసినట్లు ప్రకటించారు. అలాగే  జాతీయ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ( నాడా) పరిధిలోకి రావాలని కూడా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement